యేసుక్రీస్తు త్యాగాన్ని మనుష్యులు మరచిపోకూడదు…

యేసుక్రీస్తు త్యాగాన్ని మనుష్యులు మరచిపోకూడదు…
గుడ్ ఫ్రైడే సందర్భంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
పాయకాపురం, ఆంధ్ర ప్రభ : మనుష్యుల పాపపరిహార్దం డేవాదిదేవుడు యేసుక్రీస్తు సిలువలో ప్రాణత్యాగం చేసిన చరిత్రాత్మక ఘట్టాన్ని మనుష్యులు మరచిపోకూడదని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.గుడ్ ఫ్రైడే సందర్భంగా పాయకాపురం బైబిల్ మిషన్ షఖినా ప్రార్థన మందిరం ఆవరణలో శుభ శుక్రవారం దినాన్ని పురస్కరించుకుని సెంట్రల్ శాసనసభ్యుడు,ప్రభుత్వ విప్,బోండా ఉమామహేశ్వర రావు పాల్గొని దేవుని విషయాలు, బైబిల్ ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ రాంబాబు,టీడీపీ 64వ డివిజన్ డివిజన్ అధ్యక్షుడు కే రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఎస్ కె బాబు, కంకణాల బాబు, పరిమి అజయ్, పరిమి వెంకట్, చర్చి కమిటీ నంబర్స్ చిన్నమ్మాయి, చిన్న పాల్గొన్నారు.
