గుడివాడ పురవీధులలో సాగిన సిలువ యాత్ర..

గుడివాడ పురవీధులలో సాగిన సిలువ యాత్ర..
గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పురవీధులలో సాగిన సిలువ యాత్ర. పునీత అవిలాపురి థెరిసామ్మ దేవాలయం లో అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనిన భక్తులు. ఫాదర్ మందపాటి. లూయిస్ జయరాజు మాట్లాడుతూ యేసుక్రీస్తు యెరూషలేము నుండి కల్వరి కొండ వరకు మోసిన భారం, ఆయన అనుభవించిన వేదన మరియు త్యాగాన్ని వివరించేదే సిలువ యాత్ర. ఇది మానవాళి పాప పరిహారార్థం, దేవుని ప్రేమకు నిదర్శనంగా జరిగిన గొప్ప త్యాగం. ముళ్ళ కిరీటం, కొరడా దెబ్బలు, సిలువ భారం, అవమానాలతో సాగిన ఈ ప్రయాణం క్రీస్తు ప్రేమను చాటుతుంది అని తెలిపారు.
ఫాదర్ లూయిస్ జయరాజు సిలువ యాత్ర ముఖ్య అంశాలు తెలియజేశారు. అపహాస్యం మరియు వేదన: రోమా సైనికుల చేత కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం, ఉమ్ములు, పిడిగుద్దులతో క్రీస్తు తీవ్రమైన శారీరక, మానసిక వేదనను అనుభవించారు.
సిలువ భారం యొక్క ఉద్దేశం మనం ఎలా నడుచుకోవాలో తెలిపే మార్గం. సొంత సిలువను మోస్తూ, దారి పొడవునా అవమానాలు భరిస్తూ దేవాలయం వరకు సాగారు. ఈ యాత్రలో ఆయన కనబరిచిన ప్రేమ, క్షమాపణ మానవజాతి రక్షణ కోసం చేసిన త్యాగానికి ప్రతీక. సిలువలో ఉన్నప్పుడు యేసు పలికిన ఏడు మాటలు ఆత్మీయ సత్యాలను, క్షమాపణను తెలియజేస్తాయి.
ఇది యేసుక్రీస్తు పొందిన దుఃఖాన్ని, మన కోసమే ఆయన పడిన వేదనను గుర్తుచేసుకునే సమయం.
సిలువ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు, అది రక్షణ మార్గం, దేవుని నిస్వార్థ ప్రేమ యొక్క పరాకాష్ట అని ఫాదర్ లూయిస్ జయరాజు అన్నారు.
