సింహగిరిపై అప్పన్న కళ్యాణ మహోత్సవాలు

సింహగిరిపై అప్పన్న కళ్యాణ మహోత్సవాలు
భక్తులను బందీలను చేసి విచారించిన వైనం
ఉంగరం తీసుకొస్తేనే ఆలయంలోకి స్వామికి ప్రవేశం
స్వామి పట్టు పీతాంబరాల్లో దొరికిన ఉంగరం
వైభవంగా వినోదోత్సవం.. సంవాదసేవ
సింహగిరి, ఆంధ్రప్రభ,సింహగిరిపై అప్పన్న కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఉంగరం సేవ వినోదోత్సవం కన్నుల పండుగగా జరిపించారు. శ్రీ మహాలక్ష్మి ఉంగరం కనిపించకపోవడం అది తీసుకొని వస్తేనే ఆలయంలోకి ప్రవేశం అని స్వామికి కరాకండిగా చెప్పి అమ్మవారు తలుపులు మూసి వేయడంతో అది వెతకడానికి స్వామి మహారాజా అలంకరణలో తన పరివారంతో కలిసి గ్రామంలోకి బయలు దేరారు. ఈ సందర్భంగా పలువురు భక్తులను బందీలుగా చేసి విచారించారు.. అయితే ఎంతమందినీ విచారించినప్పటికీ అమ్మవారు ఉంగరం దొరకలేదు.. చివరకు స్వామి ధరించిన పట్టు పీతాంబ రాల్లో అమ్మవారు ఉంగరం దొరికింది.. దీంతో ఆ ఉంగరాన్ని తీసుకొని స్వామి ఆలయ ప్రవేశం చేశారు..
ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల మధ్య నిర్వహించిన సంవాద సేవ విశేషంగా భక్తులను ఆకట్టుకుంది.. సింహాచలం ఈవో జల్లిపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసచార్యులు కరి సీతారామచార్యులు పలువురు భక్తులను బందీలు చేయడం స్థానాచార్యులు టీపీ రాజగోపాల్వా రందరినీ విచారించడం.. చాలామంది భక్తులు అసలు నిజం తెలియక కంగారు పడటం ఇదంతా కూడా వినోదోత్సవంలో భాగంగా తెలుసుకుని అంతలోనే స్వామి అనుగ్రహంగా భావించి ఎంతో సంబరపడ్డారు.. ఈ ఉత్సవం అత్యంత ఉత్సాహంగా సాగింది.. కార్యక్రమంలో ఈవో వెంకట్రావు దంపతులు.. తెలంగాణ సిఎస్ కుమారుడు .. నూతన పెళ్లి జంటలు.. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు.m ప్రత్యేక ఆహ్వానితులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఎన్ఏజే . ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు.. దాత సాయికుమార్ పాటు పాత్రికేయులు.. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు తోపాటు అనేకమందిని బందీలుగా చేసి విచారణ జరిపి అనంతరం అందరికీ సింహాద్రినాధుని దర్శన భాగ్యం కల్పించి ఆశీర్వదించారు..
