ప్రజా సంక్షేమానికే పెద్దపీట

ప్రజా సంక్షేమానికే పెద్దపీట

అర్హులందరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
టిడిపి రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్

ఆంధ్రప్రభ, విజయవాడ : కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని వృద్ధులు, వితంతులు, వికలాంగులకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా, విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని 6వ డివిజన్, బ్రహ్మానంద రెడ్డి నగర్‌లో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్నా), డివిజన్ టిడిపి అధ్యక్షుడు పడాల గంగాధర్ తో కలిసి అర్హులైన వృద్ధులు, వికలాంగులకు వారి ఇంటి వద్దకే పెన్షన్లు అందజేశారు.
ఈ కార్యక్రమం లో డివిజన్ బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇంచార్జిలు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply