గోదావరి పుష్కర ఘాట్ ల పరిశీలన

గోదావరి పుష్కర ఘాట్ ల పరిశీలన
చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని గోదావరి పుష్కర ఘాట్ లను ఇవ్వాళ మున్సిపల్,ఎండోమెంట్ అధికారులతో కలసి పరిశీలించారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు.వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్లు పార్కింగ్,స్నాన ఘట్టాలు తదితర అంశాలపై ఆయన అధికారులతో సమీక్ష చేశారు.మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశానుసారం ఇక్కడ జరుగబోయే ఏర్పాట్ల పరిశీలను వచ్చామని,రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది పుష్కర ఘాట్ లకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని,అందులో ఒకటి చెన్నూర్ పట్టణ సమీపంలోని పంచక్రోశ ఉత్తర వాహిని ఘాట్ అని ఆయన తెలిపారు.

ఈ పుష్కరాలకు రోజుకు సుమారు లక్ష పై చిలుకు భక్తులు పుణ్య స్నానమాచరించి ప్రత్యేక పూజలు చేస్తారని ఆయన అంచనా వేశారు.వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసే దిశగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు.సూచించారు.వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనువుగా వుండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.ప్రశాంత వాతావరణంలో ఈ పుష్కరాలు జరుపుకోవాలని ఆయన భక్తులకు తెలిపారు.
