AP | ఫిబ్రవరి చివరికి సివిల్ పనులను పూర్తి చేయాలి

AP | ఫిబ్రవరి చివరికి సివిల్ పనులను పూర్తి చేయాలి

  • జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

AP | కర్నూలు, ఆంధ్రప్రభ : ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్, ఏపీఏంఎస్ఐడీసీ, ఏపీఈడబ్ల్యూఐడీసీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వంటి వివిధ శాఖలు చేపడుతున్న సివిల్ పనులు ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్, ఏపిఏంఎస్ఐడీసీ, ఏపీఈడబ్ల్యూఐడీసీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (యమ్ఏ & యుడీ) వంటి వివిధ శాఖలు చేపడుతున్న సివిల్ పనుల పురోగతి, క్వాలిటీ కంట్రోల్ అంశాలపై జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నిధులు ఏవీ వృథా చేయకుండా, ఫిబ్రవరి చివరి నాటికి మొత్తం నిధులను ఖర్చు చేసి ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్, ఏపీఏంఎస్ఐడీసీ, ఏపిఈడబ్ల్యూఐడీసీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (యమ్ఏ & యుడీ) వంటి వివిధ శాఖలు చేపడుతున్న సివిల్ పనులు నాణ్యతతో ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులలో కచ్చితంగా నాణ్యతను పాటించాలని, క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు తెలిపారు. అదే విధంగా బిల్లులు ఆన్లైన్ లో అప్లోడ్ చేయించే ప్రక్రియ కూడా ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లు ధనిబాబు, భాస్కర్ రెడ్డి, ఆర్ డబ్ల్యూ ఎస్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మధుసూదన్ లు..వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంచాయతీ రాజ్ ఎస్ఈ వేణుగోపాల్ , ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర రెడ్డి, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ మనోహర్, ఏపిఏంఎస్ఐడిసి ఈఈ చిరంజీవులు, క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కడప, శివసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply