కార్యకర్తకు అండగా నిలిచే ఏకైక పార్టీ తెలుగుదేశం..!

కార్యకర్తకు అండగా నిలిచే ఏకైక పార్టీ తెలుగుదేశం..!
కోడూరు , ఆంధ్రప్రభ : టీడీపీ కార్యకర్త మృతి.. వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల భీమా చెక్కు అందజేత. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనివిధంగా కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి, ప్రాణాలు పంణంగా పెట్టి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు అన్నారు.
విశ్వనాధపల్లి గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ క్రియాశీలక సభ్యుడు బత్తుల నాగరాజు చిత్రపటానికి సోమవారం కనపర్తి శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి, వారి కుటుంబ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సూచనలతో 5 లక్షల బీమా చెక్కులు మృతుని భార్యకు అందజేశారు.
భవిష్యత్తులో బాధిత కుటుంభ సభ్యులకు ఎటువంటి అవసరం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని, లోకేష్ ఇచ్చిన భరోసాను కనపర్తి వివరించారు.
పార్టీ కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యులు లాగా చూసుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని , అర్ధరాత్రి వేళ ఫోన్ చేసిన లోకేష్ టీం సభ్యులు సహాయం చేయడంలో ముందుంటారని కనపర్తి తెలిపారు.
ఈకార్యక్రమంలో దివి మార్కెట్ యార్డు చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు బండే శ్రీనివాసరావు, పిఎసిఎస్ అధ్యక్షులు తోట సాంబశివరావు,టీడీపీ నాయకులు పరుచూరి దుర్గాప్రసాద్, రేపల్లె ప్రతాప్,కోట సాయి, జాన్ విల్సన్,బడే పిచ్చయ్య స్థానిక పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
