AP |మ‌రో 38 మార్కెట్ యార్డ్ ల‌కు చైర్మ‌న్ ల నియామ‌కం

అమరావతి: రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ కొన‌సాగుతున్న‌ది. తాజాగా 38 మార్కెట్ యార్డ్ లకు ఛైర్మన్లను కూటమి ప్రభుత్వం నియమించింది. వాటిలో 31 టిడిపి, 6 జనసేన, 1 బిజెపి నేతలకు అవకాశం ఇచ్చారు. మిగిలిన మార్కెట్ కమిటీలకు త్వరలోనే ఛైర్మన్లను ప్రకటించనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. వాటిల్లో 37 టిడిపి, 8 జనసేన, 2 బిజెపికి కేటాయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *