కనకదుర్గమ్మకు విశేష పుష్పార్చన..

కనకదుర్గమ్మకు విశేష పుష్పార్చన..

ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రి ఉత్సవాలు..
పంచపత్రాలతో జగన్మాతకు ప్రత్యేక పూజలు
పాలకమండలి సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం శ్రీ పరాభవ నామ సంవత్సర వసంత నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు సోమవారం విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. వసంత నవరాత్రుల ఐదవ రోజున పూజా మండపంలో జగన్మాతకు శాస్త్రోక్తంగా విశేష పుష్పార్చన నిర్వహించారు. తెల్ల జిల్లేడు, మారేడు దళాలు, తులసి, మరువం, దవనం వంటి ఐదు రకాల పవిత్ర పత్రాలు, పుష్పాలతో అమ్మవారిని అర్చించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.

ఈ పుణ్య కార్యక్రమంలో దేవస్థాన పాలకమండలి చైర్మన్ బోర్రా రాధాకృష్ణ (గాంధీ)తో పాటు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, గుడపాటి వెంకట సరోజిని దేవి, జి.వి. నాగేశ్వరరావు, జింకా లక్ష్మిదేవి, మన్నె కళావతి, మోరు స్రవంతి, పద్మావతి ఠాకూర్, పానబాక భూలక్ష్మి, పెనుమత్స రాఘవ రాజు, సుబ్రహ్మణ్య కుమార్ ఏలేశ్వరపు, సుకాసి సరిత, తంబళ్లపల్లి రమాదేవి, తోటకూర వెంకట రమణారావు, తరిగొప్పుల పార్వతి, మార్తి రామబ్రహ్మం తదితరులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని పూజల్లో భాగమయ్యారు.
వసంత నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తిభావం ఉట్టిపడుతూ, అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

Leave a Reply