ప్రపంచ మానవాళికి శాంతిని బోధించే దైవ గ్రంథం ఖురాన్

ప్రపంచ మానవాళికి శాంతిని బోధించే దైవ గ్రంథం ఖురాన్

మౌలానా అబూ హోరేరా మదని

విజయవాడ, భవానిపురం : జమాతే అహలె హదీస్ ఆధ్వర్యంలో ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించడం జరిగినది. వేలాదిమంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో మౌలానా అబుహరేరా మదని ఈద్ నమాజ్ అనంతరం ప్రసంగిస్తూ ప్రవక్త మొహమ్మద్ బోధించిన విధం గా జీవితం గడిపితేనే ఇహ పర లోక సాఫల్యం అని అన్నారు. మౌలానా ప్రసంగిస్తూ తల్లి పాదాల కింద స్వర్గం ఉందని తల్లిదండ్రుల సేవ వలన స్వర్గంలో ప్రవేశించే అర్హత కలుగుతుందని అలాగే పొరుగు వారిని ప్రేమించమని ప్రవక్త మొహమ్మద్ బోధించారని అన్నారు.

ఎవరైనా అన్యాయంగా ఒక మానవుని హత్య చేస్తే సర్వ మానవాళిని హత్య చేసినట్టే అని అన్నారు. కురాన్ లో బోధించబడినటువంటి ప్రతి వాక్యాన్ని ముస్లింలందరూ తూచా తప్పకుండా పాటిస్తేనే జీవిత సాఫల్యం అలాగే ప్రపంచంలో శాంతి నెలకొల్పుతోందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచం అశాంతి వైపు పయనిస్తుంది ప్రపంచ శాంతి కోసం మనం అందరం పాటు పడాలని అన్నారు. రాష్ట్ర దేశ శాంతి నీ విచ్చిన్నం చేయాలని చూస్తున్న అరాచక శక్తులను శాంతి సందేశం ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి పై ఉందని అన్నారు రాష్ట్ర అభి వృద్ధి దేశ అభివృద్ధి లో మనం అందరం పాలు పంచుకోవాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా పాల్గొని అందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు.

53వ డివిజన్ కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీ కూడా అందర్నీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం మొత్తం జమాతే అహలె హదీస్ రాష్ట్ర కోశాధికారి ఫారూఖ్ ఖాన్ మర్కజ్ మస్జిద్ ఖురేషి మస్జిద్ అధ్యక్షులు యూసుఫ్ ఖాన్ రిజ్వానుల్లా పర్యవేక్షణలో నిర్వహించారు. ఈద్ నమాజ్ కార్యక్రమంలో మహిళలకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వలన పురుషులతోపాటు వేలాది మహిళలు కూడా పాల్గొనడం గొప్ప విషయం నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ముస్లిమేతర సోదరులు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకొని ఈద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

Leave a Reply