అమ్మవారి హుండీ ఆదాయం రూ.5.45లక్షలు..

అమ్మవారి హుండీ ఆదాయం రూ.5.45లక్షలు..

శావల్యాపురం, ఆంధ్రప్రభ : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని బొందిలిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అడవిపేరాంటాలమ్మ తిరునాళ్ల శుక్రవారం తెల్లవారుజాముతో ముగిసింది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ఆదాయం రూ.5.45 లక్షలు సమకూరిందని ప్రత్యేకాధికారి సీహెచ్.శివనాగిరెడ్డి తెలిపారు. ఈ ఏడాది అమ్మవారి హుండీ ద్వారా రూ.2,19,004, కొబ్బరికాయల పాట రూ. 72వేలు, కొబ్బరి చిప్పలు రూ.42,500, లడ్డు ప్రసాద విక్రయం రూ.33వేలు, చీరలపాట రూ 10,430, చందాలు, రశీదులు తదితర వాటి నుంచి రూ.1,68,906 మేర ఆదాయం వచ్చిందని తెలియజేశారు. ఆయనతో పాటు ఈవో సుధాకర్రెడ్డి, శివ కోటయ్య తదితరులు ఉన్నారు.

Leave a Reply