సొసైటీ అధ్యక్షుడి ఆత్మహత్య…

సొసైటీ అధ్యక్షుడి ఆత్మహత్య…

నవాబుపేటలో విషాదం
అనారోగ్య బాధలతో ఉరి వేసుకున్న చింత వెంకటేశ్వరావు
హత్య కేసులోనూ నిందితుడు
ఘటనపై పోలీసుల దర్యాప్తు

ఆంధ్రప్రభ పెనుగంచిప్రోలు : పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ సొసైటీ అధ్యక్షుడు చింత వెంకటేశ్వరావు (బుల్లి) అనారోగ్య సమస్యలతో మానసికంగా బాధపడుతూ శనివారం తెల్లవారుజామున తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అదే కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఈ దుర్ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, చింత వెంకటేశ్వరావు గతంలో నమోదైన ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ అంశం కూడా ఆయన మానసిక పరిస్థితిపై ప్రభావం చూపి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply