పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఓ వరం..

పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఓ వరం..
రు. 33.57 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులను పంపిణీ..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఓ వరము అని వారిని ఆర్థికంగా చేయూత ఇచ్చే పథకం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎందరికో సహాయ సహకారాలు అందిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. ఎం. డి.ఫిరోజ్ పేర్కొన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో మంత్రి ఫరూక్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ ప్రజలకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. ప్రజలు ఆపద సమయాల్లో అందించే మెడికల్ రీయబర్స్మెంట్ ముఖ్యమంత్రి సహాయ నిధి ని 24 చెక్కులను బాధ్యత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గ వ్యాప్తంగా 23 వ సారి 33.57 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధ్యత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అనారోగ్యంతో వైద్యం చేయించుకున్న లబ్ధిదారులకు ఆర్థికంగా ఆదుకునేందుకు సహాయ నిధిని అందిస్తున్నట్లు తెలిపారు . నంద్యాల టౌన్ , మండలం మరియు గోస్పాడు మండల ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు .
ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి , టిడిపి రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు , ఒంటివెలగల శీలం భాస్కర్ రెడ్డి, ఎం కృష్ణాపురం ఉప్పలపాటి బాలిశ్వర్ రెడ్డి , శేఖర్ రెడ్డి, యాలూరు వెంకట్ రెడ్డి, గోస్పాడు విశ్వనాథరెడ్డి, మాజీ కౌన్సిలర్లు కృపాకర్, సుంకన్న , నెహ్రు నగర్ వేమారెడ్డి , క్లస్టర్ ఇంచార్జ్ కామిని మల్లికార్జున, పల్లె వెంకటసుబ్బయ్య , 19 టీడీపీ ఇంచార్జ్ షేక్ మహమ్మద్ రఫీ మున్నా మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
