‘మన పల్లె-మన నీరు’

‘మన పల్లె-మన నీరు’

పనుల కోసం కొత్త జేసీబీ
జిల్లా ఎ.కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా కలెక్టరేట్ లో జిల్లాలో జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా చేపట్టిన ‘మన పల్లె-మన నీరు’ పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం తరపున కొత్త జేసీబీ (JCB) యంత్రాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన ఈ యంత్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..

వర్షాకాలం ప్రారంభానికి ముందే జిల్లాలోని చెరువులు, సప్లై ఛానళ్లు, కాస్కేడ్ చెరువుల్లో పూడికతీత పనులను పూర్తి చేయాలి. నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న కంప చెట్లను తొలగించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలి. పనుల్లో జాప్యం లేకుండా చూసేందుకే ప్రభుత్వ పరంగా కొత్త యంత్రాలను సమకూర్చుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ , డీఆర్వో విజయసారధి , డీటీవో కరుణ సాగర్ రెడ్డి, డ్వామా పీడీ విజయప్రసాద్, గ్రౌండ్ వాటర్ ఏడీ రాజశేఖర్ రెడ్డి, డి. ఈ. ఈ లు గంగాధర, గంగాద్రి, ఏఈఈ జమున బాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply