దేవినేని అవినాష్ ను కలసిన డాక్టర్ మహబూబ్ షేక్..

దేవినేని అవినాష్ ను కలసిన డాక్టర్ మహబూబ్ షేక్..

విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఈస్ట్ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ జన్మదినం సందర్భంగా పలు నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం ఉపాధ్యక్షుడు పిఎసిఎస్ మెంబర్ డాక్టర్ మహబూబ్ షేక్ ఆయన నివాసానికి వెళ్లి దేవినేని అవినాష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పార్టీ బలోపేతం కోసం అవినాష్ చేస్తున్న కృషిని అభినందించారు. పార్టీ అభివృద్ధి, ప్రజా సేవలో నాయకత్వం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply