AP | పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల….

AP | పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల….
ప్రభుత్వ వెబ్సైట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి..
మనమిత్ర 9552300009 వాట్సాప్ ద్వార కూడా హాల్ టికెట్ డౌన్లోడ్..
AP | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై 12 గంటల 45 నిమిషాలకు ముగుస్తుందన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర పరీక్షల కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికీ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. కాల నిర్ణయం పట్టికను కూడా విడుదల చేశారు. పరీక్షలు రాసేందుకు వీలుగా విద్యార్థులకు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని మంగళవారం నుంచి కల్పిస్తున్నట్లు పరీక్షల కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 10 వ తరగతికి సంబంధించిన విద్యార్థులు మరియు పాఠశాల యాజమాన్యాలు వీటిని డౌన్‌లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.

రాష్ట్రం లోని అన్ని పరీక్షా కేంద్రాలకు సంబంధించిన హాల్ టికెట్ డౌన్‌లోడ్ వివరాలను పదవ తరగతి అధికారిక వెబ్సైట్ అయిన బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు. పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ , ప్రైవేట్ , ఓఎస్ఎస్సి , మరియు ఒకేషనల్ విద్యార్థులందరి కి హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు . అధికారిక వెబ్‌సైట్ లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. డౌన్‌లోడ్ విధానంను విద్యార్థులకు వివరించారు. పదవ తరగతి చదివే విద్యార్థులు వారి తల్లిదండ్రులు విషయాలను గమనించాలి.విద్యార్థులు తమ జిల్లా, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్ పొందవచ్చుఅన్నారు. వాట్సాప్ సర్వీస్ ప్రభుత్వం ‘ ఏర్పాటుచేసిన మన మిత్ర’ 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా హాల్ టికెట్ పొందే వెసులుబాటు కల్పించిందన్నారు.
ముఖ్య గమనిక.. సవరణలు విద్యార్థులు ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లలో ఏమైనా పొరపాట్లు ఉన్నట్లు మార్పులు చేసుకోవటానికి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా సరిదిద్దుకోవాలని పరీక్షల కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.హాల్ టికెట్‌లో పేరు, ఫోటో లేదా ఇతర వివరాలలో తప్పులు ఉంటే వెంటనే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలన్నారు . హాల్ టికెట్లు మార్పులు సవరణల కోసం ఈ నెల మార్చి 31 వ తేది వరకు అవకాశం ఉందన్నారు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రభుత్వ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌పై పాఠశాల హెడ్ మాస్టర్ సంతకం సీలు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. హాల్ టికెట్ లో కేటాయించిన పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే సెంటర్లోకి చేరుకోవాలని సూచించారు.
