Anudeep | ఈసారైనా ప్లాన్ ఫలించేనా..?

Anudeep | ఈసారైనా ప్లాన్ ఫలించేనా..?

Anudeep | జాతిరత్నాలు తర్వాత అనుదీప్‌కు ఎదురైన నిరాశ
కామెడీకి గుడ్‌బై.. లేడీ ఓరియెంటెడ్ మూవీపై ఆసక్తికర ప్లాన్
స్టార్ హీరోయిన్ కోసం అన్వేషణ.. ప్రాజెక్ట్‌పై ఉత్కంఠ

Anudeep | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా పాపులరయ్యాడు డైరెక్టర్ అనుదీప్. ఆతర్వాత ప్రిన్స్ అనే సినిమా చేస్తే.. యావరేజ్ గా నిలిచింది కానీ.. ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. ఈసారి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధించాలని ఫంకీ తీస్తే.. అది డిజాస్టర్ అయ్యింది. దీంతో ఇప్పుడు అనుదీప్ రూటు మార్చాడని.. కొత్త ప్రయోగం చేయబోతున్నాడని తెలిసింది. అది కూడా ఓ స్టార్ హీరోయిన్ తో ఓ ప్రయోగం చేయబోతున్నాడని టాక్. ఇంతకీ.. అనుదీప్ ని నమ్మే బ్యూటీ ఎవరు..?

Anudeep | రూటు మారుస్తున్న అనుదీప్..

Anudeep

టాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన కామెడీ స్టైల్‌తో గుర్తింపు తెచ్చుకన్న అనుదీప్ ఫంకీ మూవీ పై చాలా ఆశలు పెట్టుకుంటే నిరాశే ఎదురైంది. దీంతో ఈసారి కామెడీ సినిమా కాకుండా లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయనున్నాడని తెలిసింది. జాతిరత్నాలు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అనుదీప్, ఆ రేంజ్ సక్సెస్ సాధించేలా తన తదుపరి ప్రాజెక్ట్‌ను భిన్నంగా ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది. అనుదీప్ ఒక లేడీ ఓరియెంటెడ్ స్టోరీ పై వర్క్ చేస్తున్నాడట. ఈ కథలో మహిళా పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని, కామెడీతో పాటు భావోద్వేగాలు కూడా ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Anudeep | అనుదీప్ ప్రయోగం..

Anudeep

ఇప్పటి వరకు అనుదీప్ ఎక్కువగా కామెడీ సినిమాలకే ప్రాధాన్యం ఇచ్చాడు. అయితే ఈసారి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని భావించడం ఆయన కెరీర్‌లో కొత్త ప్రయోగం అని చెప్పచ్చు. ప్రేక్షకులకు కొత్త తరహా కథను అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే.. ఈ సినిమాని స్టార్ హీరోయిన్ తో చేయాలి అనుకుంటున్నాడట కానీ… ఈ సినిమాలో ఎవరు హీరోయిన్‌గా నటించనున్నారన్న విషయం పై ఇంకా స్పష్టత రాలేదు. ప్రముఖ హీరోయిన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మించనుంది. త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. మరి.. అనుదీప్ ని నమ్మి సినిమా చేసే బ్యూటీ ఎవరో తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Anudeep
Anudeep

Leave a Reply