హైదరాబాద్ : ఈజీమనీ వేటలో కొంతమంది ఆన్‌లైన్ గేమింగ్‌కి, బెట్టింగ్‌కి అడిక్ట్ అవుతున్నారు. లక్కు కలిసి వస్తుందనే ఆశతో లక్షల రూపాయలు బెట్టింగ్‌లకు తగలేస్తున్నారు. లక్కీ భాస్కర్ మాటదేవుడెరుగు.. అప్పుల్లోంచి కోలుకునే మార్గం కనబడక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (Software Engineer) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పవన్ బేగంపేట్ (Begumpet) లో ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. అతని స్నేహితులతో పాటు ఎల్లారెడ్డి గూడాలోని ఓ బాయ్స్ హాస్టల్ లో ఉంటున్నాడు. హఠాత్తుగా సోమవారం ఉదయం బాత్రూంలో సూసైడ్ చేసుకున్నాడు. ఉదయం బాత్‌రూమ్‌లోకి వెళ్లిన పవన్ ఎంతకీ బయటికి రాకపోవడంతో స్నేహితులకు అనుమానం వచ్చి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు పవన్.
పవన్ సెల్‌ఫోన్ పరిశీలించడంతో బెట్టింగ్ యాప్ (Betting app) ల మెసేజ్ లు ఉన్నట్లు గుర్తించారు. ఇటీవలే పవన్ తండ్రి అప్పులు చెల్లించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మధురానగర్ పోలీసులు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించడంతో పశ్చిమగోదావరి జిల్లాకు తరలించారు.