Flight missing : అమెరికాలో మరో విమానం మిస్సింగ్
అమెరికాలో శుక్రవారం (అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం) మరో విమానం మిస్సయింది. బెరింగ్ ఎయిర్ ఫ్లైట్ 445, సెస్నా 208B గ్రాండ్ కారవాన్ అలస్కా మీదుగా ఉనాలక్‌లీట్ నుంచి నోమ్‌కు వెళ్తుండగా తప్పిపోయినట్లు తెలుస్తోంది. అందులో ఒక పైలట్ సహా 9మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
విమానం జాడ కనుక్కునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలస్కాలోని ప్రతికూల వాతావరణంగా కారణంగానే విమానం అదృశ్యమైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల వాషింగ్టన్, ఫిలడెల్ఫియాలో జరిగిన వరుస విమాన ప్రమాదాల్లో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే.