ప్రేమ శాంతి త్యాగానికి మరో పేరు యేసుక్రీస్తు

జుక్కల్(కామారెడ్డి), ఆంధ్రప్రభ : ప్రేమ శాంతి త్యాగానికి మరో పేరు యేసుక్రీస్తుఅని,జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు అన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రపంచ మానవాళికి యేసుక్రీస్తు ప్రేమ,దయా,కరుణలాంటి శాంతి సందేశాలను ఇవ్వడం జరిగిందని,ఆయన సందేశాలు మార్గదర్శనియమన్నారు. క్రైస్తవ సోదర,సోదరీమణులు అందరూ గుడ్ ఫ్రైడేను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ పవిత్రదినం అందరి జీవితాల్లో నూతన వెలుగులు,ఆనందాన్ని ఇవ్వాలని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు కోరుకున్నారు.
