Anil Ravi pudi | మెగా బ్లాక్ బస్టర్ థ్యాంక్యూ మీట్..

Anil Ravi pudi | మెగా బ్లాక్ బస్టర్ థ్యాంక్యూ మీట్..

Anil Ravi pudi | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబోలో రూపొందిన మెగా బ్లాక్ బస్టర్ మన శంకర వర ప్రసాద్ గారు. ఇందులో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ల పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా బ్లాక్ బస్టర్ థాంక్ యూ మీట్ నిర్వహించారు.

Anil Ravi pudi | కెరీర్ లో ఫస్ట్ టైమ్..

థాంక్ యూ మీట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఈ సంక్రాంతిని కూడా నాకు ఇంత మెమొరబుల్ గా చేసిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ థాంక్యూ సో మచ్. మళ్లీ మళ్లీ ఇలాంటి మంచి సినిమాలు తీసి మీకు ఆనందాన్ని ఇచ్చి దాని ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నా కెరీర్ లో చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేసిన స్క్రిప్ట్ ఇది. 25 రోజుల్లో స్క్రిప్ట్ పూర్తి చేశాను. దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. కాసేపు చిరంజీవి గారు అనకుండా సగటు ప్రేక్షకులు చిరంజీవి గారిని ఎలా అభిమానిస్తారో అనుకుంటే.. డైలాగులు చాలా కూల్ గా క్యాజువల్ బాడీ లాంగ్వేజ్ తో మాట్లాడాలంటే.. దానికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది. చిరంజీవి, కంటి నుంచి నీళ్లు బయటికి రాకుండా మనందరినీ ఏడిపించాలంటే… చిరంజీవి, డ్యాన్స్ ని గ్రేస్ ఫుల్ గా చేయాలంటే.. చిరంజీవి, వంద మంది ఫైటర్స్ (Fighters) ఎదురుగా నిలబడితే ఒక ఆటిట్యూడ్ తో సిగరెట్ వెలిగించి బాసిజం చూపించాలంటే.. చిరంజీవి.. ఇలా చెప్పుకుంటూ పోతే నటనలో ఉన్న నవరసాలని అద్భుతంగా అందంగా తన మార్క్ స్టైల్ తో మనందరికీ ప్రజెంట్ చేసింది చిరంజీవి. అలాంటి చిరంజీవి గారికి కథ రాస్తున్నప్పుడు ఆయనలో ఉన్న ప్రత్యేకతలు అన్నిటిని కలుపుకుంటూ వెళ్లిపోయాను. ఆయన కొన్ని దశాబ్దాలుగా ఎలా అలరించారో అవన్నీ కలుపుకుంటూ వెళ్లాను. అందుకే స్క్రిప్టు అంత ఫాస్ట్ గా ఫినిష్ అయ్యింది.

Anil Ravi pudi

Anil Ravi pudi | ఇన్ స్పిరేషన్ ఆయనే..

ఇందులో రాసిన ప్రతి సీన్ కి ఇన్ స్పిరేషన్ చిరంజీవి గారే. అందుకే ఈ క్రెడిట్ మొత్తం చిరంజీవి గారికి ఇస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిరంజీవి గారి అభిమానులు, ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చిరంజీవి గారు ఈ సినిమాలో అడుగడుగునా ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేసే అవకాశం నాకు కల్పించారు. అభిమానులు (Fans) చూపిస్తున్న, ప్రేక్షకులు చూపిస్తున్న.. ప్రేమ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. కొంత మంది మెగా ఫాన్స్ నన్ను లాక్కెళ్ళి ముద్దు పెట్టాలని కూడా చూశారు.( నవ్వుతూ) అంత అభిమానం చూపిస్తున్నారు. వాళ్ళు చూపిస్తున్న అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. ఇదంతా కుదిరింది అంటే దానికి కారణం చిరంజీవి గారు.

Anil Ravi pudi

Anil Ravi pudi | బ్యూటిఫుల్ మెమరీ..

చిరంజీవి గారు 150 సినిమాలు చేసిన అనుభవం ఉన్న ఒక లెజెండరీ హీరో. మేమందరం కూడా ఆయన సినిమాలు (Movie) చూస్తూ పెరిగాం అలాంటిది నేను ఒక కథ అనుకుని ఒక టైమింగ్ అనుకొని ఆయన దగ్గరికి వెళ్తే.. ఆయన కూడా మా అందరితో కలిసిపోయి ఒక నార్మల్ మనిషి లాగా అందరికీ ఫ్రీడమ్ ఇస్తూ ఆయన అనుభవాన్ని మాతో పంచుకుంటూ మా అందరినీ నడిపించిన శంకరుడు మా చిరంజీవి గారు. ఆయనతో పని చేసిన 85 రోజులు ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ మెమరీ. ఆయన గురించి ఇంకా చెప్పాల్సింది ఎంతో ఉంది. అది సక్సెస్ మీట్ లో చెప్తాను.

Anil Ravi pudi | ఆ డ్రీమ్ నెరవేరింది..

ఈ సినిమాకి నిర్మాతలుగా చేసిన సాహు నా ఫ్రెండ్. తను తన ఫెయిల్యూర్ వచ్చినా సక్సెస్ వచ్చినా ఒకేలా ఉంటాడు. ఇంత పెద్ద బడ్జెట్ ని ఇంత స్టార్ కాస్ట్ ఇచ్చి సినిమాని ఒక అద్భుతంగా నిర్మించారు. ఈ సినిమాకి మరో ప్రొడ్యూసర్ సుస్మిత గారు. నేను ప్రతి సినిమా సక్సెస్ కి జోన్ అవుట్ లో ఉంటా. ఇంత పెద్ద సక్సెస్ కొట్టానా అనే జోన్ అవుట్ లో ఉంటా. సుస్మిత గారు కూడా అలాంటి జోన్ అవుట్ లో కనిపించారు. చిరంజీవి గారి ఒక అద్భుతమైన ప్రాజెక్టులో (Project) తన పేరు ఉండాలని కలలు కన్నా సుస్మిత గారికి ఆ డ్రీమ్ నెరవేరినందుకు కంగ్రాజులేషన్స్. తను ముందు ముందు మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. సంక్రాంతికి వసూళ్లపరంగా ఇద్దరు నిర్మాతలు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ప్రేక్షకులు ఎంత సంతోషపడ్డారో డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను.

Anil Ravi pudi

Anil Ravi pudi | ఈ సక్సెస్ లో ఆయనది పెద్ద భాగం..

సమీర్ రెడ్డి గారు అద్భుతమైన ఫోటోగ్రఫీ ఇచ్చారు. ప్రకాష్ గారు అద్భుతమైన సెట్లు వేశారు భీమ్స్ అద్భుతమైన పాటలు బిజిఎం ఇచ్చాడు. చాలా కష్టపడ్డాడు. మా జర్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మా రైటింగ్ టీమ్ అందరికీ థాంక్యు. వాళ్ళ సపోర్ట్ నేను మర్చిపోలేను. తమ్మి రాజు గారు నా మొదటి సినిమా నుంచి నాతో ఉన్నారు. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఆర్టిస్ట్ కి పేరుపేరునా ధన్యవాదాలు. నయనతార గారికి థాంక్యూ. చిరంజీవి (Chiranjeevi) గారు నయనతార గారి జోడి అద్భుతంగా కుదిరింది. వెంకటేష్ గారు మాతో ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ట్రావెల్ అయ్యారు. ఒక అద్భుతమైన కామియో రోల్ చేశారు. థియేటర్స్ లో ఆడియన్స్ ఎంతో గొప్పగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇద్దరు స్టార్స్ ఒకళ్ళపాటకి ఒక డాన్స్ చేయడం థియేటర్స్ లో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాత్రని ఒప్పుకున్నందుకు వెంకటేష్ గారికి హాట్సాఫ్. ఈ సక్సెస్ లో ఆయనది కూడా చాలా పెద్ద భాగం ఉంది. మెగా ఫ్యాన్స్ నుంచి వస్తున్న ప్రేమ గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఈ సంక్రాంతి కూడా నాకు మెమరబుల్ గా చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అందరికీ థాంక్యు సో మచ్ అన్నారు.

CLICK HERE TO RAED బన్నీ, సుక్కు ప్లాన్ అదిరింది..

CLICK HERE TO READ MORE

Leave a Reply