Andhra prabha | ప్రజలకు అందిస్తున్న సేవలు అమోఘం

Andhra prabha | ప్రజలకు అందిస్తున్న సేవలు అమోఘం
- జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
జుక్కల్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రభ దినపత్రిక ప్రజలకు అందిస్తున్న సేవలు అమోఘమని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ఆయన బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రభ క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఆంధ్రప్రభ ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తూ ప్రజల సమస్యలను, సాధకబాధకాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు.
పార్టీలకతీతంగా నిష్పక్షపాతంగా వార్తలను అందిస్తూ, అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ ముందుకు సాగుతుందన్నారు. నిజాలను నిర్భయంగా బయటపెడుతూ… ఆంధ్రప్రభ ప్రజాసేవకు అంకితం కావటం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, జుక్కల్ ఆంధ్రప్రభ రిపోర్టర్ సయ్యద్ వహబ్, తదితరులు పాల్గొన్నారు.
