Vikarabad | అనుమానాస్పద స్థితిలో..

Vikarabad | అనుమానాస్పద స్థితిలో..
తాండూరు పట్టణంలో ఘటన
Vikarabad | తాండూరు, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా (Vikarabad district) తాండూరు పట్టణంలో పట్టపగలు దారుణం జరిగింది. రక్తగాయాలతో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
తాండూరు మండలం అంతారం తాండాకు చెందిన రాము నాయక్ (Ramu Nayak)(50) అనే వ్యక్తి తాండూరు పట్టణం ఎడ్ల బజార్ సమీపంలో మృతదేహాంగా కనిపించాడు. రాము నాయక్ తలపై రక్తగాయాలు కనిపించాయి. దీంతో అనుమానాస్పదంగా రాము మృతి చెందినట్లు స్థానికులు భావించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు (police) సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ఆసుపత్రి మార్చురికి తరలించారు.

