మాన్కుగూడ గ్రామంలో ఆదర్శ కార్యక్రమం

జైనూర్, ఆంధ్రప్రభ ; కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోనిమాన్కుగూడ గ్రామంలో గ్రామస్థులు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. పెళ్లిళ్ల సమయంలో నిర్వహించే ఆహేరి కార్యక్రమం (డబ్బాలు, బట్టలు వంటి బహుమతులు ఇవ్వడం)ను నిషేధిస్తూ, వాటికి ఖర్చయ్యే డబ్బును ఒకచోట జమ చేసి పెళ్లికి సహాయంగా ఇవ్వాలని గ్రామస్థులు నిర్ణయించారు.

ఈ నిర్ణయం ప్రకారం గ్రామస్థులు సేకరించిన రూ.18,101నగదును ఆదివారం కుమ్రా కర్ణు కుమార్తె రేష్మ పెళ్లికి గ్రామ పెద్దలు గ్రామస్థుల చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా గ్రామ పటేల్, సర్పంచ్ కుమ్రం దేవుషావ్ మాట్లాడుతూ, మాన్కుగూడ గ్రామంలో తీసుకున్న ఈ మంచి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కట్టుబడి పాటించాలని అన్నారు.

అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు మన గ్రామంలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్క గ్రామంలో కూడా నిర్వహించాలి, సామాజిక ఐక్యతను పెంపొందించే కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆయన పేర్కొన్నారు. గ్రామస్థుల ఈ నిర్ణయం సమాజానికి మంచి సందేశం ఇస్తూ, ఐక్యతకు ఒక ఆదర్శంగా నిలుస్తుందని పలువురుఅభిప్రాయ
వ్యక్తపరుస్తున్నారు.

Leave a Reply