టేకుమట్ల నూతన ఎస్ఐగా అమూల్య..

టేకుమట్ల నూతన ఎస్ఐగా అమూల్య..
టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల నూతన సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐగా గైకవాడ అమూల్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు టేకుమట్ల సబ్ ఇన్స్పెక్టర్ ఎస్సైగా విధులు నిర్వహించిన సుధాకర్ రేగొండ పోలీస్ స్టేషన్ కు బదిలీ పై వెళ్లారు.
టేకుమట్ల పోలీస్ స్టేషన్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అమూల్య మాట్లాడుతూ.. గణపురం రెండవ ఎస్ఐగా పని చేసిన అమూల్య టేకుమట్ల మండలానికి బదిలీ పై వచ్చినట్లు తెలిపారు. మండల ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. మండలంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీస్ సిబ్బందికి సహకరించాలని అన్నారు. అలాగే ఇది వరకు ఎస్సైగా విధులు నిర్వహించిన సుధాకర్ మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రతలను కాపాడినందుకు పోలీస్ సిబ్బందికి సహకరించిన మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
