కరీమాబాద్ (ఆంధ్రప్రభ) చారిత్రాత్మక వరంగల్ రైల్వే స్టేషన్ ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ఉదయం ప్రారంభించారు. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 25..41 కోట్ల నిధులతో అమృత భారత్ పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా వరంగల్ రైల్వే స్టేషన్ రూపుదిద్దారు. కాకతీయుల కలలు. స్టేషన్లో ప్రయాణికులను ఆకట్టుకున్నాయి.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఇతర రాజేందర్, మహబూబ్నగర్ ఎంపీ గళ్ళ అరుణ, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు, హనంకొండ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, రైల్వే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నీరజ్ అగర్వాల్ , ఏసీ ఎమ్ శ్రీరామ్ మూర్తి, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, నగరపాలక సంస్థ అశ్విని వాకాడే, కుడా చైర్మన్, బిజెపి జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.