among147countries | అదే ఆ దేశం ప్రత్యేకత..

among147countries | అదే ఆ దేశం ప్రత్యేకత..
among147countries | చిన్న విషయాల్లోనే ఆనందం కనుగొనే సంస్కృతి
కష్టాల మధ్య కూడా నవ్వే దేశం ఫిలిప్పీన్స్
ప్రపంచంలోనే సంతోషకరమైన దేశంగా గుర్తింపు
147 దేశాల సర్వేలో ఫిలిప్పీన్స్ తొలి స్థానం
భారత్ 118వ స్థానంలో కొనసాగుతున్న స్థితి
ఫిలిప్పీన్స్ ప్రజల ఆనందానికి కుటుంబ వ్యవస్థే కారణం
కష్టకాలంలో కూడా నవ్వే జీవన విధానం
సమస్యలు ఉన్నప్పటికీ సానుకూల దృక్పథంతో జీవనం
among147countries | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నవ్వు వచ్చినప్పుడు అందరూ నవ్వుతారు. కానీ ఎడుపు వచ్చినప్పడు నవ్వగల వాడే నిజమైన మనిషి అని రాజేంద్ర ప్రసాద్ నటించిన పెళ్లి పుస్తకం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఆ సినిమా పేరు గుర్తుకు వచ్చిందంటరా ? ఆ సినిమాలో చెప్పినట్టే ఒక దేశం ఉంది. అదే ఆసియాలోని చిన్న దేశమైన ఫిలిప్పీన్స్.

మిగతా దేశాల్లాగానే ఈ దేశానికీ ఎన్నో కష్టాలు ఉన్నాయి. ప్రకృతి విపత్తులు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ అక్కడి ప్రజలు కష్టాలు వచ్చాయని కృంగిపోరు, విపత్తులు వచ్చాయని భయపడరు. ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ, జీవితాన్ని సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఆ దేశం ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.
ప్రపంచంలో చాలా దేశాల్లో అశాంతి నెలకొన్న నేపథ్యంలో ఓ దేశం మాత్రం శాంతిని కోరుకుంటూ ప్రపంచంలోనే సంతోషకరమైన దేశంగా ఉంటుంది. అదే ఆసియాలోని ఫిలిప్పీన్స్ అనే చిన్న దేశం. పలు అంతర్జాతీయ సర్వేల్లో ఫిలిప్పీన్స్ ప్రజలు ప్రపంచంలో అత్యంత సంతోషంగా జీవిస్తున్న వారిలో ఒకరిగా నిలుస్తున్నారు. ఆర్థిక సవాళ్లు, ప్రకృతి విపత్తులు ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం ఆనందంగా ఉంటూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు.

World Happiness Report అనే సంస్థ 147 దేశాల్లో సర్వే చేయగా మొదటి స్థానంలో ఫిలిప్పీన్స్, రెండో స్థానంలో డెన్మార్క్ దేశాలు సంతోషకరమైన దేశాలుగా గుర్తింపు పొందాయి. అయితే భారత్ స్థానం 118వ స్థానంలో కొనసాగుతుంది. భారత్ కంటే పాకిస్థాన్ 109వ స్థానంలో ముందుంది. ఫిలిప్పీన్స్ ప్రజలు తమ జీవితాన్ని సానుకూలంగా చూడడంలో ముందున్నారని ఈ సంస్థ వెల్లడించింది.

ఈ నివేదికలో దేశాల అభివృద్ధి మాత్రమే కాదు, ప్రజల జీవన సంతృప్తి, సామాజిక బంధాలు, ఆరోగ్యం, ఆర్థిక భద్రత, పరస్పర సహకారం వంటి అంశాల్లో ఫిలిప్పీన్స్ ప్రజలు మంచి అవగాహన కలిగి ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఫిలిప్పీన్స్ ప్రజల ఆనందానికి ప్రధాన కారణం కుటుంబ వ్యవస్థ అని నిపుణులు చెబుతున్నారు. అక్కడ కుటుంబ బంధాలు చాలా బలంగా ఉంటాయి. తల్లిదండ్రులు, పిల్లలు మాత్రమే కాకుండా బంధువులు కూడా కలిసి జీవించడం సర్వసాధారణ విషయం. సమస్యలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు ఒకరికొకరు సహాయం చేయడం వల్ల ఒత్తిడి తక్కువగా ఉంటుందని నిపుణులు తెలిపారు.
World happiest country | ఫిలిప్పీన్స్ ప్రజలు ఏం అంటున్నారు..?

జీవితం ఒక గిఫ్ట్ Life is a gift, so we try to enjoy it అని వారు బలంగా నమ్ముతారు. జీవితం దేవుడిచ్చిన వరమని భావించి దాన్ని సంతోషంగా గడపాలని తాము భావిస్తామని, అందుకే ప్రతిరోజూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తామని వారు అంటున్నారు.
World happiest country | చిన్న విషయాల్లో ఆనందం చూస్తాం..

ఫిలిప్పీన్స్ ప్రజలు తరచుగా ఇలా అంటారు. We find happiness in small things అంటే పెద్ద సంపద లేకపోయినా కుటుంబంతో భోజనం చేయడం, స్నేహితులతో మాట్లాడటం, పండుగలు జరుపుకోవడం వంటి చిన్న విషయాల్లోనే ఆనందం పొందుతామని వారు తెలిపారు.
World happiest country | కుటుంబం మా బలం..

Family is everything for us అని వారు ఎక్కువగా చెబుతారు. కుటుంబ సభ్యులందరం కలిసి ఉంటాం, ఒకరికొకరు సహాయం చేసుకుంటామని, అందుకే కష్టాల్లో కూడా మేము ఎక్కువగా నిరాశ చెందమని చెబుతారు.
World happiest country | ఏ పరిస్థితుల్లోనైనా నవ్వుతాం..

Even in difficult times, we still smile అని వారు చెబుతారు. ఆర్థిక సమస్యలు లేదా ప్రకృతి విపత్తులు వచ్చినా నవ్వుతూ ఎదుర్కోవడం వారి సంస్కృతిలో భాగమని అంటారు. అయితే ఫిలిప్పీన్స్ పూర్తిగా సమస్యలేని దేశం కాదు. ప్రకృతి విపత్తులు, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు వంటి సవాళ్లు అక్కడ కూడా ఉన్నాయి. అయినప్పటికీ జీవితం పట్ల సానుకూల దృక్పథం కారణంగా ప్రజలు తమ జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.
