America| చోర్ మాటలకు కేరాఫ్ ట్రంప్

America| చోర్ మాటలకు కేరాఫ్ ట్రంప్
- మాట మార్చడంలో దిట్ట
- నేనే గ్రేట్ అనే ఫీలింగ్‌లో అమెరికా ప్రెసిడెంట్
ట్రంప్ బాబాయ్‌కి ఓ వీక్నెస్ ఉంది… ప్రపంచంలో తనకంటే గొప్పొడు లేడు.. బాహుబలి సినిమాలో రాజమాత డైలాగ్‌లా నా మాటే శాసనం.. అన్నట్లు వ్యవహరిస్తుంటాడు. నేనేమి చెప్పినా లోకమంతా నమ్మేస్తదనే ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ట్రంప్ ఉంటాడు. చోర్ మాటలు చెబితే జనం పిచ్చిగా నమ్మేస్తారని ఆయన ఇన్నర్ ఫీలింగ్. కానీ జనం అంత పిచ్చోళ్లు కాదు కదా.. నిజాలేవో.. అబద్ధాలేవో తెలుసుకోలేనంత అజ్ఞానంలో లేరు కదా.. ఇది తెలియక అబద్ధాల అధ్యక్షుడు … సారీ సారీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోటికొచ్చిందే వాగేస్తుంటాడు..
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట మార్చడంలో దిట్ట. తానే గొప్పవాడినని చెప్పుకునే క్రమంలో అనేక పాట్లు పడుతున్నాడు. ఇటీవల భారత్ అమెరికా మధ్య జరిగిన ట్రేడ్ డీల్ తర్వాత అమెరికా ఫ్యాక్ట్ షీట్ ను విడుదల చేసింది. అమెరికాకే మేలు చేకూరుతుందన్న రీతిలో దాన్ని విడుదల చేశారు. కానీ అవన్నీ అబద్దాలే. దానిపై భారత్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో అమెరికా దీన్ని వెనక్కి తీసుకుంది. వీటిలో ముఖ్యంగా భారత్ సుంకాలు సున్నాకు తగ్గించే అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తుల్లో కొన్ని పప్పుధాన్యాలు కూడా ఉన్నాయంటూ విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్‌ను సవరించుకుంది. అంతేకాదు గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ టెక్ సంస్థలు భారత్‌లో పొందే ఆదాయంపై వేస్తున్న డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్‌ను కూడా భారత్ తొలగిస్తుందన్న అంశాన్నీ వెనక్కి తీసుకుంది. వీటితో పాటు 45 లక్షల కోట్లు అంటే 500 బిలియన్ డాలర్ల అమెరికా ఉత్పత్తులను కచ్చితంగా దిగుమతి చేసుకుంటామని భారత్ మాటిచ్చిందన్న అంశాన్నీ మార్చి.. దిగుమతులు చేసుకునేందుకు ప్రయత్నిస్తామని భారత్ హామీ ఇచ్చిందని చేర్చింది. ఈ మేరకు సవరించిన ఫ్యాక్ట్‌షీట్‌ను విడుదల చేసింది. తద్వారా ట్రంప్ అబద్దాలకోరు అని మరోసారి నిరూపితమైంది.
