america | ట్రంప్ పాలనపై నిరసన జ్వాలలు.

america | ట్రంప్ పాలనపై నిరసన జ్వాలలు.
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ముప్పై యుద్ధాలూ అరవై యుద్ధాలన్నట్లుగా ఉంది ట్రంప్ పాలన…ఏమైనా ఏ దేశాన్ని ఎలాంటి సుంకాలతో వేధిద్దామా, ఏ శంపై బాంబులతో విరుచుకుపడదామా అన్న ఆలోచనే తప్ప, అంతకు మించి ఒక్క మంచి ఆలోచన కూడా అతడి మనసులో లేదు, రాదని స్వయంగా అమెరికన్లే విసుక్కుంటున్నారట. ఇరాన్ ను నాశనం హర్మూజ్ ను తెరవక పోతే చేస్తానని ట్రంప్ చేసిన హెచ్చరికలు అత్యంత ఆందోళలనలు రేకెత్తించేవిగా ఉన్నాయి.
ఒకపక్క స్వదేశంలో తన పాలనపై రేగే నిరసన జ్వాలలను చూసుకోకుండా ఇరాన్ పై హెచ్చరికల గర్జనలు చేస్తున్న ట్రంప్ ని చూస్తే ఎవరికైనా ఏవగింపు కలుగుతుంది.
ఇప్పటికే అతలాకుతలమైన అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒకవైపు, మిత్రదేశాలతో అస్తవ్యస్తమైన వ్యాపార వాణిజ్య సంబంధాలింకొకవైపు…విదేశీయులపాలిటి ఒకప్పటి భూతల స్వర్గమేనా ఈ అమెరికా అనిపించేట్లు తయారైంది అక్కడి పరిస్థితి.
అక్కడున్నవారూ, ఆ దేశానికి రావాలనుకున్నవారూ కూడా జంకే పరిస్థితే తప్ప ఏ ఒక్కరూ ట్రంప్ పాలన పట్ల సంతోషంగా లేరు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ట్రంప్ చిత్తుగా ఓడిపోవడం ఖాయం అనుకుంటున్నారట.
