కాశీబుగ్గ, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత, మహానుభావుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మార్టిన్ లూథర్ ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం కాశిబుగ్గ సర్కిల్ లో ఉన్నటువంటి విగ్రహానికి బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈసందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ… డాక్టర్ అంబేద్కర్ మన దేశానికి రాజ్యాంగం రూపుదిద్దిన మహానీయుడన్నారు. సమానత్వం, న్యాయం, స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వం వంటి విలువలను భారత ప్రజలకు అందించిన దార్శనిక నాయకుడు, ఆయన చూపిన మార్గం ఎప్పటికీ నిత్యనూతనంగా మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. వీరితో పాటు మాజీ మేయర్ తక్కలపల్లి రాజేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్, బన్న ప్రభాకర్, సముద్రాల పరమేశ్వర్, గడల కుమార్, కందిమల్ల మహేష్, కోమాకుల నాగరాజు, మారుమూల్ల ప్రవీణ్, జనార్ధన్, నాయకులు పాల్గొన్నారు.

