Ambedkar Gurukul | అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల..

Ambedkar Gurukul | అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల..
- ఐదవ తరగతి, ఇంటర్మీడియట్‌లో చేరటానికి అడ్మిషన్లు..
- 3320 సీట్లకు దరఖాస్తులు ఆహ్వానం..
Ambedkar Gurukul | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాబోయే విద్యా సంవత్సరం 2026-27 విద్యా సంవత్సరం కు విద్యార్థులకు సాంఘిక సంక్షేమ విద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం రాష్ట్ర విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉచిత చదువు, ఉచిత వసతి, పౌష్టికాహారం లభిస్తాయి. పాఠశాలలో చేరాలనుకునే విద్యార్థులు 5వ తరగతి, ఇంటర్మీడియట్ లో చేరటానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఐదో తరగతికి 1680 సీట్లు ఇంగ్లీషు తెలుగు మీడియంలో ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఫస్టియర్ కోర్సులైన ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఇసి హెచ్ఈసి గ్రూపులో చేరటానికి అడ్మిషన్లుకోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో అన్ని కోర్సులకు కలిపి 1640 సీట్లు ఉన్నాయి. బ్యాక్‌లాగ్ సీట్లు అంటే ఆయా పాఠశాలలు కళాశాలల్లో మిగిలిపోయిన 6 నుండి 10వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్లను కూడా భర్తీ చేస్తారు. ఈ పాఠశాలలో చేరటానికి విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం లక్ష రూపాయల లోపు ఉండాలి. మూడు నాలుగు తరగతులు ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివి ఉండాలి. 5వ తరగతి అడ్మిషన్ కోసం 24 -25 సంవత్సరంలో నాలుగో తరగతి చదువుతూ ఉండాలి.
విద్యార్థి తన సొంత జిల్లాలోని పాఠశాలలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తులు ఆన్లైన్లో తీసుకోవటానికి ఫిబ్రవరి 19 వ తేదీ చివరి తేదీగా ప్రకటించారు. ఆలోపు విద్యార్థులందరూ ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మార్చి 1 వ తేది న ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామన్నారు.5వ తరగతి విద్యార్థులకు ఉదయం 9:30 నుండి, పరీక్షలు ప్రారంభమవుతాయి. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం 12 గంటల నుండి పరీక్ష ఉంటుందని నోటిఫికేషన్ లో తెలిపారు. ఈ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు విద్యార్థులకు అనేక ప్రయోజనాలుఉన్నాయి.
