KNL | గీత కార్మికులకు లక్కీ డిప్ లో మద్యం దుకాణాల కేటాయింపు
కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లా పరిధిలోని గీత కార్మికులకు రిజర్వేషన్ కల్పించిన 10షాపులకు, జిల్లా కలెక్టర్ అనుమతితో గెజిట్ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించగా, మొత్తం 133 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో దరఖాస్తు రూపంలో 62, ఆన్ లైన్ ద్వారా 73మొత్తం 133 దరఖాస్తులు దాఖలయ్యాయి. వీటిలో 111 గౌడ ఉపకులస్తులు దాఖలు చేశారు.
పై వాటిని జిల్లా ప్రోహిబిషన్, ఎక్సయిజ్ అధికారులు పరిశీలన చేసి సోమవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి.నవ్య ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించి 10షాపులను సక్సెస్ ఫుల్ అప్లికేంట్స్ లను ఎంపిక చేశారు. ఈకార్యక్రమంలో కర్నూలు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు రాజశేఖర్ గౌడ్, రామక్రిష్ణరెడ్డి, జిల్లాలోని ఎక్సైజ్ స్టేషన్ అధికారులు పాల్గొన్నారు.
