రోడ్లన్నీ జలమయం
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool district) కేంద్రంలో ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు భారీ వర్షం కురిసింది. రెండున్నర సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఉయ్యాలవాడ నుండి మొదలుకొని ఈశ్వర్ కాలనీ 9 జంక్షన్(9th junction) మసీదు ప్రాంగణం బస్టాండ్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, రామకృష్ణ థియేటర్ రోడ్డు, నల్లవెల్లి రోడ్డు పై నీటీ వరదలు ప్రవహించి జలమయమైపోయింది. రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఫీటు ఎత్తు నీళ్లు పారాయి. మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం రెండు మూడుసార్లు స్వల్పంగా పడి నిలిచిపోయింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు(at 12 noon) ప్రారంభమైన వాన చిన్నగా కురుస్తూ రెండు గంటల ప్రాంతంలో భారీగా వర్షం దాదాపు రెండు గంటల పాటు కురిసింది. గంట పాటు జనజీవనం స్తంభించిపోయినట్టు అనిపించింది.
నిలిచిపోయిన నీటిని డ్రైనేజీల ద్వారా గంటలోపు వెళ్లిపోయిన తర్వాత రాకపోకలు, వాహనాలు, ప్రజలు తమ ప్రయాణాలను ప్రారంభించారు. ఏది ఏమైనా వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వర్షాభావం పరిస్థితులు ఇంకా ఉన్నట్లు తెలుస్తోంది.


