సమగ్ర అభివృద్ధి బీజేపీ నినాదం

ఆలేరు, ఆంధ్రప్రభ : సర్వ సమగ్ర అభివృద్ధి బిజెపి నినాదం అని ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా సీనియర్ నాయకులు పసుపునూరి వీరేశం, పంపరి లక్ష్మీనారాయణ చెప్పారు. ఆలేరు మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో బిజెపి కౌన్సిలర్ అభ్యర్థుల ప్రచార కార్యక్రమాన్ని వారు శనివారం సందర్శించి పరిశీలించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. ప్రజల కోసం పనిచేసే మోదీ సారధ్యానికి మద్దతుగా బిజెపి కౌన్సిలర్ అభ్యర్థులను ప్రజలు గెలిపిస్తారన్న ధీమా తమకు ఉందని వారు తెలిపారు.
