జాతీయ అధ్యక్షురాలికి ఆత్మీయ స్వాగతం

జాతీయ అధ్యక్షురాలికి ఆత్మీయ స్వాగతం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కు చెందిన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మా వెంకటస్వామి ఆదివారం హైదరాబాద్ గాంధీభవన్ లో జరిగిన నూతన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబకు పద్మ పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు.

నూతన రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణకు కూడా పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళా కాంగ్రెస్ మరింత బలోపేతమై పార్టీ పురోభివృద్ధికి ఎంతో బలంగా మారుతుందని పద్మ ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply