Alert | దిత్వా పై అప్రమత్తం..

Alert | బాపట్ల కలెక్టరేట్, ఆంధ్రప్రభ : మోంథా తుఫాన్ వచ్చి పోయింది. సైనర్ దూరంగా వెళ్ళింది. ఇప్పుడు విరుచుకుపడుతూ ఏపీ వైపు దూసుకు వస్తున్న దిత్వా తుఫాన్ నేపథ్యంలో బాపట్ల జిల్లాలో తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసిన హెచ్చరికల మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. దాన్య సేకరణ వేగంగా జరిగేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో తార్ఫాలిన్ పట్టాలు 2000 వరకు రైతులకు సమకూర్చారు. వేటకు వెళ్లిన జాలర్లను వెనక్కి పిలిపించారు.

24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అధికారులు సిబ్బంది సిద్దంగా ఉండాలన్నారు. తీర ప్రాంత ప్రజలను లోతస్తు ప్రాంత ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డిజాస్టర్ రెస్పాన్స్ టీంను వివిధ శాఖల అధికారులతో సిద్ధం చేశారు. మండల స్థాయి అధికారులు వారికి కేటాయించిన వారి ప్రాంతాలలో తీరం దాటే వరకు ప్రజలకు అక్కడే అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా వస్తున్న నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అన్నారు. బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున దిత్వా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.

Leave a Reply