ప్రజా ప్రభుత్వ పథకాలే గెలుపుకు తోడ్పడతాయి

ప్రజా ప్రభుత్వ పథకాలే గెలుపుకు తోడ్పడతాయి

ఆలేరు, ఆంధ్రప్రభ: సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా చేపట్టి అమలుపరిచిన సంక్షేమ పథకాలు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు బాటలుగా మారుతాయని టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ వార్డులలో శనివారం కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదం తప్పనిసరిగా తమ పార్టీ అభ్యర్థులకు దక్కుతుందని తెలిపారు. పార్టీ శ్రేణులు గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా కృషి చేస్తున్నాయని చెప్పారు. అత్యధిక మునిసిపల్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Leave a Reply