akhanda2 | అంత హేట్ అవసరం లేదు.

akhanda2 | అంత హేట్ అవసరం లేదు.

akhanda2 ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబోలో రూపొందిన చిత్రం ‘అఖండ 2: ది తాండవం.

ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సినిమా విశేషాలు పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

akhanda2 |మామూలు విషయం కాదు.

సినిమా బాగుంటే అన్ని బాగుంటాయి. మ్యూజిక్ అనేది ఒక క్రాఫ్ట్. మన క్రాఫ్ట్ ని మనం బెస్ట్ గా చేయాలి. డాకు మహారాజ్, గేమ్ చేంజెర్, ఓజి.. అఖండ2.. రాబోతున్న రాజాసాబ్ ఇవన్నీ కూడా వరుసగా కలిసి వచ్చాయి. స్క్రిప్ట్ అనుకున్నప్పుడే కొన్ని హై మూమెంట్స్ అనుకుంటాం. బోయపాటి ఆషామాసి డైరెక్టర్ కాదు. కమర్షియల్ సినిమా నమ్మించేలా తీయడం నిలబెట్టడం చాలా గొప్ప విషయం. అందులోనూ సనాతన ధర్మం కంటెంట్ గా తీసుకుని దాన్ని కమర్షియల్ గా చెప్పడం, అందులోనూ బాలయ్య లాంటి సూపర్ మాస్ ఎనర్జిటిక్ స్టార్ తో చేయడం మామూలు విషయం కాదు.

akhanda2 | అందరికీ సర్ ఫ్రైజ్..


అఖండపాత్ర అందరికీ సర్ ఫ్రైజ్. నిజానికి అఖండలో అంత ఉంటుందని ఎవరూ అనుకోలేదు. సెకండ్ పార్ట్ కి వచ్చే సరికి మరింత భారీ అంచనాలతో ప్రేక్షకులు వచ్చారు. సనాతన ధర్మాన్ని అద్భుతంగా చెప్పి కమర్షియల్ విజయాన్ని సాధించడం.. బాలయ్య, బోయపాటి ఈ ఇద్దరికే ఆ క్రెడిట్ దక్కుతుంది. ఇక ఛాలెంజింగ్ విషయానికి వస్తే.. నిజానికి అఖండ చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. బోయపాటికి నాకు రెండు నెలలు సమయం కావాలని అడిగాను. ఒక్క రీల్ చేసి చూపించాను. ఆయనకు చాలా నచ్చింది. అప్పుడు నాకున్న బడ్జెట్ ని మార్చి, నాకు మరింత సమయాన్ని ఇచ్చి ఎంతగానో సపోర్ట్ చేయించి చేసి మ్యూజిక్ చేయించారు.

అఖండకి అయిన నాకు వెన్నెముకలా నిలిచారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలనే తాపత్రయంతో వర్క్ చేశాను. అఖండ మ్యూజిక్ అందరూ సర్ ప్రైజింగ్ గా విన్నారు.

akhanda2 | 73 రోజులు..

అఖండ2 లో ఇంకా ఎంత కొత్తగా చేయొచ్చు అని ఆలోచించాను. అందులోనూ తాండవం అని పేరు పెట్టారు. ఆడియన్స్ ని ఎలా ట్రాన్స్ లోకి తీసుకువెళ్లాలి.. అని ఆలోచన చేస్తూ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశాం. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడానికి 73 రోజులు పట్టింది. అందులో ఒక 20 రోజులు శివుని మంత్రాలు ఎంత కొత్తగా చేయాలి అనే దానికి ఒక 20 రోజులు ఎక్సర్ సైజ్ చేశాం. తర్వాత 40 రోజులు ఇన్స్ ట్రుమెంట్స్ రికార్డింగ్ వర్క్ చేసాం. జాజికాయ సాంగ్ తప్పితే సినిమాలోని ఎనిమిది పాటలు కూడా ఆ 70 రోజుల్లో చేసినవే. అఖండ మ్యూజిక్ బ్రెయిన్ కి చాలా మంచి ఎక్సర్సైజ్. శివుడికి సినిమా చేస్తున్నప్పుడు మన మెదడు చాలా శుద్ధి అవుతుంది.

akhanda2 | ఛాలెంజ్ మొదలైంది..

akhanda2
akhanda2

బోయపాటి సినిమాలో ఇంటర్వెల్, క్లైమాక్స్ చేయడం చాలా కష్టం. మొదటి రీల్ నుంచి నాకు ఛాలెంజ్ మొదలైంది. అష్టసిద్ధి కుంభమేళా ఇంటర్వెల్, ఆది ఎపిసోడ్, హనుమంతుడు ఎపిసోడ్, లాస్ట్ లో అవెంజర్స్ లాంటి క్లైమాక్స్ ఇవన్నీ చాలా హార్డ్ వర్క్ తో కూడుకున్నవి. బోయపాటి సినిమాలన్నీ ఒక రీల్ కు మించి మరొకటి ఉంటుంది. ఆయన ఎనర్జీని పట్టుకోవడం చాలా కష్టం. మా టీం చాలా సపోర్ట్ చేశారు. ఇక బాలయ్య సపోర్ట్ గురించి అడగక్కర్లేదు. ఆయనను చూస్తే.. వేరే లెవెల్ ఎనర్జీ ఉంటుంది. ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉంటాయి. ఒక్కొక్క రీల్ చేసి ఆయన్ని స్టూడియోకి తీసుకొచ్చి వినిపించడం చాలా అద్భుతంగా జరిగిన ప్రయాణం.

akhanda2 | అది షాకింగ్..

నిజానికి నాకు అది షాకింగ్. ఎందుకంటే.. ఎవరూ కూడా ఊహించలేదు. అయితే.. మా బాధంతా అభిమానుల గురించే. వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి థియేటర్స్ ని ముస్తాబు చేసి ప్రీమియర్స్ కి రెడీగా ఉన్నారు. చివరి నిమిషంలో వాయిదాతో వారు నిరాశతో వెనుతిరగడం బాధించింది. మేము సినిమా పరంగా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అది ఎప్పుడు రిలీజ్ అయిన దాని బలం దానికి ఉంటుందని గట్టి నమ్మకం. ఆ నమ్మకం ఈరోజు నిజమైంది. అయితే.. ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియాలో చాలా హేట్ వస్తుంది. దీని గురించి సక్సెస్ మీట్ లో ఎమోషనల్ గా మాట్లాడాను. అంత హేట్ అవసరం లేదని చెప్పడమే నా ఉద్దేశం.

click here for more

click here to read 2nd movie | మెగా పవర్ స్టార్ రాం చరణ్

నిజానికి నాకు అది షాకింగ్. ఎందుకంటే.. ఎవరూ కూడా ఊహించలేదు. అయితే.. మా బాధంతా అభిమానుల గురించే. వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి థియేటర్స్ ని ముస్తాబు చేసి ప్రీమియర్స్ కి రెడీగా ఉన్నారు. చివరి నిమిషంలో వాయిదాతో వారు నిరాశతో వెనుతిరగడం బాధించింది. మేము సినిమా పరంగా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అది ఎప్పుడు రిలీజ్ అయిన దాని బలం దానికి ఉంటుందని గట్టి నమ్మకం. ఆ నమ్మకం ఈరోజు నిజమైంది. అయితే.. ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియాలో చాలా హేట్ వస్తుంది. దీని గురించి సక్సెస్ మీట్ లో ఎమోషనల్ గా మాట్లాడాను. అంత హేట్ అవసరం లేదని చెప్పడమే నా ఉద్దేశం.

నిజానికి నాకు అది షాకింగ్. ఎందుకంటే.. ఎవరూ కూడా ఊహించలేదు. అయితే.. మా బాధంతా అభిమానుల గురించే. వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి థియేటర్స్ ని ముస్తాబు చేసి ప్రీమియర్స్ కి

Leave a Reply