Airport | ఇద్దరు అరెస్ట్

Airport | ఇద్దరు అరెస్ట్

Airport | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డ్రగ్స్ రాకెట్‌ను అధికారులు బహిర్గతం చేశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు రూ.25 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

సందేహాస్పదంగా కనిపించిన ప్రయాణికులను తనిఖీ చేసిన అధికారులకు డ్రగ్స్ లభ్యమయ్యాయి. వెంటనే వారిని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌పై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Leave a Reply