Aditya Dhar | ఆ .. ఇద్దరి స్టార్స్ లో క్రేజీ మూవీ ఎవరితో..?

Aditya Dhar | ఆ .. ఇద్దరి స్టార్స్ లో క్రేజీ మూవీ ఎవరితో..?
పాన్ ఇండియా సెన్సేషన్ ధురందర్
ధురందర్ 2పై భారీ అంచనాలు
టాలీవుడ్‌లోకి ఆదిత్య ధర్ ఎంట్రీ?
ఎన్టీఆర్ లేదా అల్లు అర్జున్‌తో కాంబినేషన్?
అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడు?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ ధురందర్. ఈ మూవీకి డైరెక్టర్ ఆదిత్య ధర్. ధురందర్ మూవీ ఊహించని బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆదిత్య ధర్ కు డిమాండ్ పెరిగింది. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ మాత్రమే కాదు.. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ సైతం.. ఆదిత్య ధర్ తో సినిమా చేయాలి అనుకుంటున్నారు. అయితే.. ఆదిత్య ధర్ ఫోకస్ టాలీవుడ్ లో ఇద్దరు స్టార్స్ పై ఉందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ ఇద్దరు స్టార్స్ ఎవరు..?
Aditya Dhar | ధురందర్ 2 వస్తుందని..

ధురందర్ మూవీ ఈ రేంజ్ లో సక్సెస్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. బాలీవుడ్ మూవీగా రిలీజైన ధురందర్ మిగిలిన భాషల్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఇప్పుడు ధురందర్ 2 మూవీని పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ చూస్తుంటే.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో వసూలు రాబడుతుంది..? ఎలాంటి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది..? అనేది ఆసక్తిగా మారింది. ఇంకా చెప్పాలంటే.. ధురందర్ 2 వస్తుందని కొన్ని పాన్ ఇండియా సినిమాలు పోస్ట్ పోన్ చేసారంటే.. ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
Aditya Dhar | ఒక్క సినిమాతోనే..

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సెన్సేషనల్ బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్.. ఇప్పుడు టాలీవుడ్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఒక్క సినిమాతోనే అందరి దృష్టి తన వైపుకు తిప్పుకున్నాడు. టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైన బడా నిర్మాణ సంస్థ ఆదిత్య ధర్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఇక ఈ మూవీలో హీరోగా నటించే హీరోలు అంటూ ఇద్దరు స్టార్స్ పేరు వినిపిస్తున్నాయి. ఎవరా స్టార్స్ అంటే.. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో ఆదిత్య ధర్ కాంబినేషన్ ని లాక్ చేయాలని ట్రై చేస్తున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి.. ధురందర్ డైరెక్టర్ తో ఏ టాలీవుడ్ హీరో మూవీ ఫిక్స్ అవుతుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
