Adilabad | మాజీ ఎంపీటీసీకి ఎంపీ నగేష్ పరామర్శ

Adilabad | మాజీ ఎంపీటీసీకి ఎంపీ నగేష్ పరామర్శ
Adilabad| ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా(Adilabad District ఉట్నూర్ మండలంలోని మండలంలోని సాలేవాడ (కె) బీజేపీ మాజీ ఎంపీటీసీ సల్గర్ రవీందర్ తండ్రి సల్గర్ పాండురంగ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గొడం నగేష్ ఈరోజు మాజీ ఎంపీటీసీ రవీందర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులనుపరామర్శించారు.
మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎంపీ తోపాటు ఉట్నూర్ మాజీ వైస్ ఎంపీపీ దావూలే బాలాజీ, మాజీ ఎంపీటీసీ కందుకూరి రమేష్, మాజీ కారోబార్ సండే సుభాష్ శ్రీరామే భగవాన్ పాటిల్, మాజీ ఉపసర్పంచ్ జీ భూపతి, నాయకులు కోరంగ నరేష్, సల్గర్ బాబారావు పాల్గొని మాజీ ఎంపీటీసీ రవీందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
