Adilabad | తోడుగా లేక‌పోతే ప‌రేషాన్‌…

Adilabad | తోడుగా లేక‌పోతే ప‌రేషాన్‌…

Adilabad | కుబీర్, ఆంధ్రప్రభ : రైతన్న ఆరు కాలాలు కష్ట కాయం చేసి చేతుకొచ్చిన పంటను మార్కెట్కు అమ్ముకునేందుకు వచ్చిన రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. ఇది నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని మార్కెట్(market) కార్యాలయం సోయా కొనుగోళ్ల రైతు తెచ్చిన పంటను ఒకపక్క తెమతో కష్టాలు మరోపక్క అమ్ముకునేందుకు తెచ్చిన సోయ జల్లెడ పట్టే సమయంలో రెండు మూడు సోయాబస్తాలను ఒకేసారి కుమ్మరించి చెల్లిపోయేలా చేస్తున్నారు.

రైతు లబోదిబోమంటున్న పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. సోయా పంట అమ్ముకునేందుకు రైతు వెంబడి తోడుగా ఎవరు లేకపోతే ఆ రైతు పరేషాన్ చేస్తున్నారని రైతు వ్యాపోతున్నారు. చివరిగా మిగిలిన కొంత తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒకరిద్దరు సంచుల్లో నింపుకొని వెళ్లగొట్టి ఇంకొందరిని దొరికినంత దోచుకుంటున్నారు జల్లెడ కింద చిల్లిపోయిన అవి ఊడ్చుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ కుప్పలుగా పోసుకుంటున్నార‌ని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎలక్ట్రానిక్ పవర్ ఉన్న మ్యాన్ పవర్ కొరతతో హమాలీలతో ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతుందని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక నిఘ పెట్టి రైతుకు ఇబ్బంది కలగకుండా చూడాలని మండల రైతులు కోరుతున్నారు .

Leave a Reply