Adilabad | 686 జంటలు సత్యనారాయణ స్వామి వ్రతాలు…

Adilabad | 686 జంటలు సత్యనారాయణ స్వామి వ్రతాలు…
Adilabad | దండేపల్లి, ఆంధ్రప్రభ : కార్తీక బహుళ చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ రామా సహిత సత్యనారాయణ స్వామి(Gudem Sri Rama Sahitya Satyanarayana Swamy) దేవస్థానంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని 686 మంది జంటలు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకున్నారు.
ముందుగా గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసుకున్నారు. కార్తీక మాసం ఆఖరి శుక్రవారం(Last Friday) కావడంతో భక్తులు జిల్లా నుండి కాకుండా ఇతర జిల్లా నుండి తరలి వచ్చి ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించి, సత్య దేవుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించకొన్నారు. అనంతరం స్వామి వారికి నైవేద్యాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్ని వసతులు కల్పించారాని తెలిపారు.
