అదనపు కలెక్టర్ కొల్ల బత్తుల కార్తీక్
కలెక్టరేట్‌లో బాధ్యతల స్వీకరణ
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం కొల్ల బత్తుల కార్తీక్ నూతన జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఛాంబర్‌లో సహచర అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ జిల్లా పరిపాలనలో సమర్థత, పారదర్శకతను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రభుత్వ పథకాల ఫలితాలను ప్రజలకు చేరవేసే దిశగా అధికారులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసే దిశలో చర్యలు చేపట్టటం విశేషమని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.