Activists | ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన ఉద్యమకారులు

Activists | ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన ఉద్యమకారులు
Activists | నర్సింహులపేట,ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల మహబూబాబాద్ జిల్లా ముఖ్య సలహాదారు సమ్మెట సమ్మయ్య గౌడ్ అన్నారు.
సోమవారం మండల కేంద్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. గుర్తింపు కార్డు ఉన్న ఉద్యమ కారులందరికీ 240 గజాల స్థలాన్ని, పింఛన్లను, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. స్పందించిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బానోత్ లాలు, మండల ముఖ్య సలహాదారుడు బొమ్మగాని వెంకన్న, ఉపాధ్యక్షుడు ఆకుతోట సాయి కృష్ణ, దూర శ్రీపాల్,వర్షం సోమయ్య, నీలం అంబరీష్, రమేష్,నర్సయ్య తదితరులు ఉన్నారు.
