Achampeta | పుల్జాల సర్పంచిగా ఇమ్మడి వెంకటయ్య ఘన విజయం

Achampeta | పుల్జాల సర్పంచిగా ఇమ్మడి వెంకటయ్య ఘన విజయం
Achampeta | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట మండలం పుల్జాల గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు ఇమ్మడి వెంకటయ్య ఘన విజయం సాధించారు. బుధవారం నిర్వహించిన పోలింగ్లో ఆయన తన సమీప ప్రత్యర్థిపై 400 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల ప్రచారంలో గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, రోడ్లు, విద్యుత్, పారిశుధ్యం వంటి సమస్యలపై శాంతి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఫలితాలు వెలువడిన వెంటనే గ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఇమ్మడి వెంకటయ్య మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పారదర్శకంగా పాలన సాగిస్తానని ఆయన పేర్కొన్నారు. ఇమ్మడి వెంకటయ్య గెలుపునకు అహర్నిశలు శ్రమించిన ఉమామహేశ్వర చైర్మన్ బీరం మాధవరెడ్డికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. గ్రామంలోని 10 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ తొమ్మిది వార్డులను కైవసం చేసుకుంది.
