కర్నూల్ బ్యూరో -కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం,నందవరం మండలంలోని ముగతి గ్రామ సమీపంలో ఎన్ హెచ్ 167 పై ఆదివారం గొర్రెల మందపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ఈ ప్రమాదంలో కాపరి లింగప్ప(22) అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో పాటు నాలుగు గొర్రెలు మృతి చెందాయి.మృతుడు ఆస్పరి మండలం జోహారాపురం గ్రామం కు చెందిన వ్యక్తి గా గుర్తింపు.నందవరం ఎస్ఐ కేశవ సిబ్బంది తో ఘటన స్థలాన్ని పరిశీలించారు.లింగప్ప మృతదేహాన్ని శవ పరీక్షల కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు..
టైర్ పేలి అదుపు తప్పిన లారీ. ,
ఎమ్మిగనూరు మండలం, కోటేకల్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసులు వెల్లడించిన మేరకు ఆదోని నుంచి ఎమ్మిగనూరు వెళుతున్న లారీ టైరు ప్రమాదవశాత్తు పేలిపోయింది. దీంతో ఆ లారీ అదుపుతప్పి ఎమ్మిగనూరు నుంచి ఆదోని వైపు వస్తున్న కారును దీంతో ఆ కారు అదుపుతప్పి మరో కారును ఢీకొంది. దీంతో ప్రమాదంలో ముందు కారులో ఉన్న ప్రహ్లాద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎమ్మిగనూరు పోలీసులు సంఘటన స్థలం చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.