Accident | ఘోర రోడ్డు ప్రమాదం..

Accident | ఘోర రోడ్డు ప్రమాదం..

Accident, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వలన రాత్రుల్లు ప్రమాదాలు జరగడం నిత్యకృత్యమయ్యాయి. శనివారం తెల్లవారుజామున జడ్చర్ల – కోదాడ 167 జాతీయ రహదారి పై కర్ణాటక నుంచి శ్రీశైలం దైవ దర్శనానికి వెళుతున్న క్రూసర్ ఊర్కొండ మండలం తిమ్మనపల్లి గ్రామ శివారులో కల్వర్టుకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. పలువురికి గాయాలు అయ్యాయి. అయితే.. మృతులు కర్ణాటక వాసులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Leave a Reply