accident | కారు ప్రమాదం..

accident | కారు ప్రమాదం..

accident | పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రు – దిగమర్రు జాతీయ రహదారి పై కొత్త పెదమద్దాలి వద్ద ఈ రోజు రోడ్డు ప్రమాదం జరిగింది. గుడివాడ వైపు వెళ్తున్నకారును వెనుక నుంచి ద్విచక్ర వాహనం(Two-wheeler) బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రి(hospital)కి తరలించారు. ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Leave a Reply