Accident | ఆటో-బొలెరో ట్రాలీ ఢీ…
- విద్యార్థులకు తీవ్ర గాయాలు
Accident | లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : పట్టణంలోని భగత్ సింగ్ నగర్ నుంచి ప్రభుత్వ బాలికల, బాలుర పాఠశాలలకు విద్యార్థులను తరలించే ఆటో ను బొలెరో ట్రాలీ ఢీ(Bolero trolley collision) కొనడంతో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయలైనట్లు ఈ రోజు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. స్థానిక సీ ఎస్ ఐ రోడ్ లోని కెనాల్ వద్ద ఆటోను వేగంగా వచ్చిన బొలెరో ట్రాలీ ఢీ కొనడంతో ఆటో కాలువలో పడిపోయింది.
స్థానికులు గాయపడిన విద్యార్థులను హుటాహుటిన ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు తీవ్రంగా గాయపడిన విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల జిల్లా ఆసుపత్రి(hospital)కి తరలించారు. మొత్తం 9 మంది విద్యార్థులు ఆటోలో ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

కాగా, ఇప్పటికే పలు పత్రికలలో ఎన్నోసార్లు ఈ ఇరుకైన కెనాల్ ప్రమాదాల గురించి కథనాలు వచ్చినప్పటికీ సంబంధిత ఇరిగేషన్ అధికారులు(irrigation officials) పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైన ఎస్సై సురేష్ త్వరగా ఇరిగేషన్ అధికారులను సంప్రదించి కెనాల్ వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, సీ ఎస్ ఐ చర్చ్ గెట్ వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలిస్తే ప్రమాద వివరాలు మరింతగా తెలిసే అవకాశాలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. కాగా, ఆటో డ్రైవర్ రామస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


